Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాగునీటి కోసం గిరిజన మహిళల ధర్నా

లింగంపేట, డిసెంబరు 2: మండలంలోని జగ దాంబ తండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు గురువారం ఽఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గత వారం రోజులుగా మిసన్‌ భగీరథ నీ రు రాకపోవడంతో తండాలో తాగునీరు లేక వ్యవసా య బోరుబావుల నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. తండాలో ఉన్న బోరుబావికి విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోవడం తో తండాలో తాగునీటి కోసం నానా తిప్పలు పడుతున్నా మన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్‌కు, ఇతర అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తండాలోని బోరు మోటారుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, మిషన్‌ భగీరథ నీరు తండాకు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement