Abn logo
Jan 21 2021 @ 10:23AM

‘వర్కింగ్ ఫ్రమ్ సైకిల్’ పేరుతో ఆ స్నేహితులు ఏం చేశారంటే...

ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పలు కార్యాలయాలు తమ సిబ్బందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. సరిగ్గా ఇదే సమయంలో ముగ్గురు స్నేహితులు ‘వర్కింగ్ ఫ్రమ్ సైకిల్’ పేరిట వినూత్న ప్రయోగం చేశారు. బకెన్ జార్జ్, అల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్‌లు తమ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని వినూత్నంగా వినియోగించుకున్నారు. ఆ సమయంలో వీరు తమ ఆఫీసు పనిచేస్తూనే, ముంబై నుంచి కన్యాకుమారికి ప్రయాణం చేశారు. దారిలోని దాబాలు, లాడ్జిలలో ఉంటూ వారి ఆఫీసు వర్క్ చేస్తూనే 1,687 కిలోమీటర్ల సుదీర్ఘ సైకిల్ యాత్ర చేపట్టారు. 

రెండు దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్నవీరు తమ వర్కింగ్ ఫ్రమ్ సైకిల్ అనుభవాలను వివరిస్తూ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని సాహసోపేతమైన అనుభవంగా మార్చుకోవాలనుకున్నామన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తలెత్తే నెగిటివ్ ఆలోచనలకు చెక్ చెబుతూ, వర్కింగ్ ఫ్రమ్ సైకిల్ ప్రయోగం చేశామన్నారు. ఇది తమకెంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. తాము ఆఫీసు వర్క్ చేస్తూనే ఈ సైకిల్ యాత్ర చేశామని వారు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement