Abn logo
Jul 12 2020 @ 05:55AM

రాష్ట్రంలో పారదర్శక పాలన: స్పీకర్‌ సీతారాం

 ఆమదాలవలస: రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శనివారం శ్రీనివాసాచార్యులపేట, దన్నానపేట, జొన్నవలస, గాజులకొల్లివలసల్లో రైతుభరోసా కేంద్రాలు, పాఠశాల, హెల్త్‌ సబ్‌సెంటర్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్‌ రాష్ట్రంలో అవినీతి లేనిపాలన చేస్తున్నారన్నారు. రైతు భరోసాకేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయన్నారు.


గత ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలను మూసి వేసిందన్నారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.వెంకటరాజు, ఆర్వీఎం పీవో పైడి వెం కటరమణ, డీఈ పి.ధర్మారావు, నాయకులు తమ్మినేని చిరంజీవినాగు, శ్రీరామమూర్తి, జి.ప్రభాకరరావు, ధన్నాన సత్యానారాయణ, జగన్నాఽథం,  పేడాడ వెంకట సూర్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement