Abn logo
Feb 26 2021 @ 00:44AM

మరో రైలుకు పచ్చజెండా

ఏప్రిల్‌ 1 నుంచి.. కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌


 గుంటూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రైళ్ల పునరుద్ధరణలో భాగంగా కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ని రైల్వేశాఖ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పట్టాలెక్కించబోతోంది. దీనివలన నరసరావుపేట, వినుకొండ మార్గంలో మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి రిజర్వుడ్‌ సర్వీసుగానే ఈ రైలుని నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. నెంబరు.07251 గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిత్యం రాత్రి 7 గంటలకు బయలుదేరి 7.17కి పేరేచర్ల, 7.28కి ఫిరంగిపురం, 7.49కి నరసరావుపేట, 8.19కి వినుకొండ, ఆ తర్వాత కురిచేడు, దొనకొండ, గజ్జలకొండ, మార్కాపురం రోడ్డు, తర్లుపాడు, కంభం, జగ్గంబొట్ల కృష్ణాపురం, సోమిదేవిపల్లె, గిద్దలూరు, దిగువమెట్ట, గాజులపల్లి, అర్ధరాత్రి 12.05కి నంద్యాల, బేతంచర్ల, ద్రోణాచలం, శ్రీబాల బ్రహ్మేశ్వర జోగులాంబ, గద్వాల్‌, శ్రీరాంనగర్‌, వనపర్తిరోడ్డు, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉందానగర్‌, బద్వేల్‌, ఫలక్‌నుమా, మలక్‌పేట మీదుగా మరుసటిరోజు ఉదయం 9.45కి కాచిగూడ చేరుకొంటుంది. నెంబరు.07252 కాచీగూడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ నిత్యం మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.05కి నంద్యాల, మరుసటిరోజు వేకువజామున 3.15కి వినుకొండ, 3.44కి నరసరావుపేట, 4.05కి ఫిరంగిపురం, 4.16కి పేరేచర్ల, ఉదయం 6.45కి గుంటూరు చేరుకొంటుంది. ఈ రైలులో ఒక ఏసీ త్రీటైర్‌, ఆరు స్లీపర్‌క్లాస్‌, 9 సెకండ్‌ సిట్టింగ్‌, 2 బ్రేక్‌ వ్యాన్‌ కలిపి మొత్తం 18 బోగీలుంటాయి. 


నిత్యం గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు డివిజన్‌కు ఏసీ, సెకండ్‌ సిట్టింగ్‌ సీట్ల కోటాని పెంచుతూ రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఏసీ చైౖర్‌కార్‌ సీట్లు గుంటూరు డివిజన్‌ నుంచి 54 మాత్రమే అందుబాటులో ఉండేవి. దాంతో ప్రయాణికులు మంగళగిరి/విజయవాడ నుంచి బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 145 ఏసీ చైర్‌కార్‌ సీట్లని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే సెకండ్‌ సిట్టింగ్‌ సీట్లు గుంటూరు నుంచి 305 అందుబాటులో ఉండేవి. ఆ సంఖ్యని 1,092కి పెంచారు. దీంతో ఇకనుంచి ఈ రైలుకు గుంటూరు నుంచి బుకింగ్‌ చేసుకోదలిచిన వారికి పుష్కలంగా సీట్లు అందుబాటులో ఉంటాయి. 


 గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో వంతెనలపై ఉన్న ఛానల్‌ స్లీపర్లని మార్చి వాటి స్థానంలో అధునాతనమైన హెచ్‌-బీమ్‌ స్లీపర్లు ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ టెండర్ల ప్రక్రియని ప్రారంభించింది. మొత్తం 1,819 ఛానల్‌ స్లీపర్లను మార్చాల్సి ఉందని అంచనా వేశారు. ఇందుకోసం రూ.4.77 కోట్లు రైల్వేబోర్డు మంజూరు చేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి బిడ్డింగ్‌ ప్రారంభమౌతుంది. మార్చి 17న టెండర్లు ముగించి ఏజెన్సీని ఖరారు చేస్తారు. ఛానల్‌ స్లీపర్లు కారణంగా వంతెనలపై రైళ్లు ప్రయాణించేటప్పుడు వేగాన్ని తగ్గించుకోవాల్సి వస్తోన్నది. హెచ్‌-బీమ్‌ స్లీపర్ల ఏర్పాటు వలన ఆ సమస్య తొలగిపోతుంది. 


పేరేచర్ల నుంచి పార్శిల్‌ రవాణా  

పేరేచర్ల రైల్వేస్టేషన్‌ నుంచి పార్శి ల్‌ రవాణా సౌకర్యాన్ని రైల్వేశాఖ ప్రారంభించింది. 23టన్నుల మిర్చిటి క్కీలను ఇక్కడి నుంచి నాగాలాండ్‌ రాష్ట్రంలోని దిమాపూర్‌ రైల్వే స్టేషన్‌కి పార్శిల్‌ వ్యాన్‌ ద్వారా పంపించింది. పేరేచర్ల రైల్వేస్టేషన్‌ గుంటూరు - అనంతపురం రోడ్డు మార్గంలో ఉంది. జాతీయ రహదారి నెంబరు.  గుంటూరు నుంచి సాతులూరు వర కు రైల్వేడబ్లింగ్‌ కూడా పూర్తయింది. ఈ సౌకర్యాలు నేపథ్యంలో మిర్చి, ఇతర సరుకులు ఎగుమతి చేయ దలచిన వర్తకులు పేరేచర్ల రైల్వేస్టే షన్‌లో సంప్రదించాలని సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
Advertisement