Abn logo
Oct 25 2020 @ 05:29AM

నల్లమల ఘాట్‌ రోడ్డులో నిలిచిన ట్రాఫిక్‌

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 24 : నల్లమల ఘాట్‌రోడ్డులో లారీలు నిలిచి శనివారం రాత్రి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దిగువమెట్టకు 5 కిలోమీటర్ల దూరంలో నల్లమల ఘాట్‌రోడ్డులో రిపేరు కారణంగా ఓ లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచింది. దీంతో మరోలారీ పక్క నుండి వెళ్ళేందుకు ప్రయత్నించింది. రోడ్డు అంచులో ఆ లారీ ఇరుక్కుపోవడంతో అటూ, ఇటూ కిలోమీటరు మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యగా రాత్రిపూట ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందిపడకుండా దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

Advertisement
Advertisement