Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి

ప్రొద్దుటూరు, డిసెంబరు 2 :పట్టణంలోని వ్యాపారులందరూ ట్రెడ్‌ లైసెన్స్‌ పొందాలని మున్సిపల్‌ కమిషనర్‌ పి.వెంకటరమణయ్య పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన వార్డు శానిటేషన్‌ సిబ్బంది, సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశుధ్యపరంగా ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. శానిటేషన్‌ సెక్రెటరీలు జాబ్‌చార్టు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. పారిశుధ్య సిబ్బంది మీ మాట వినకపోతే సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దోమలు వ్యాప్తి ఎక్కువ కాకుండా చూడాలన్నారు. పారిశుధ్య సిబ్బందికి యూనిఫాం, అవసరమైన పనిముట్లు ఇచ్చారా? లేదా? అని శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ఆరా తీశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌, శానిటీరీ సూపర్‌వైజర్‌ గోవిందరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement