Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రదర్శనలో ప్రమాద

జనాల మీదికి దూసుకెళ్లిన ట్రాక్టర్‌ 

ఒకరి మృతి... ఇద్దరికి గాయాలు  

శెట్టూరు, డిసెంబరు 4: మండలంలోని అయ్యగార్లపల్లిలో జానడీర్‌ కంపెనీకి చెందిన డెమో ట్రాక్టర్‌ అదుపుతప్పి, జనాల మీదికి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు మరణించారు. బస్టాండు సమీపాన ట్రాక్టర్‌ ప్రదర్శన నిర్వహిస్తుండగా.. అదుపుతప్పి గోవింద చౌదరి అనే రైతు పశువులు పాకలోకి దూసుకెళ్లింది. అక్కడే ప్రదర్శన తిలకిస్తున్న అదే గ్రామానికి చెందిన బొమ్మ హరిజన రామాంజనేయులు (52)ను వేగంగా ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని కళ్యాణదుర్గం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఇతడు గ్రామం లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. జోగప్ప, కుంటి ఎల్లప్పకు కూడా గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శెట్టూరు ఎస్‌ఐ గ్రామానికి వెళ్లి, ప్రమాదానికి కారణాలను ఆరాతీశారు. కేసు నమోదు చేసుకుని, ట్రాక్టర్‌ను పోలీ్‌సస్టేషనకు తరలించారు.Advertisement
Advertisement