Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరి రైతుల పరిస్థితి అత్యంత దయనీయం: Revanth

హైదరాబాద్: వరి పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మాది కాదు అంటే మాది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన 13 మద్దతు ధర పంటల్లో వరి కూడా ఉందని తెలిపారు. మద్దతు ధర ప్రకటించడం అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం అని అర్థమన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు.  4,743 కేంద్రాలను పేరుకు మాత్రమే ఓపెన్ చేశారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 2100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 116 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడుస్తోందన్నారు. కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్లలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని...మిల్లర్లు దోపిడీకి తెరలేపారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement