Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంకట్‌రాంరెడ్డి నామినేషన్‌పై ఫిర్యాదు చేశాం: Revanth

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ వెంకట్ రాం రెడ్డికి సహకారం అందిస్తోందని ఆరోపించారు. నిన్ననే ఎన్నికల ప్రధానాధికారికి దీనిపై పిర్యాదు చేశామని... తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. నామినేషన్ పాత్రలు పరిశీలించే సమయంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే దాన్ని తిరస్కరించాలని తెలిపారు. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి జాతీయ పార్టీగా  లోపలికి అనుమతించమని అడిగితే రానివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఈఓకు కలువనున్నామని...తరువాత ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement