May 9 2021 @ 11:49AM

కృతి, కేతికల మధ్య గట్టి పోటీ..?

'ఉప్పెన' సినిమాతో కృతిశెట్టి, 'రొమాంటిక్' తో కేతిక శర్మ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇద్దరు అవకాశాలు అందుకోవడంలో బాగానే పోటీ పడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సౌత్ అండ్ నార్త్ సినిమాల కోసం స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్నల మాదిరిగా ఈ యంగ్ బ్యూటీస్ కూడా పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఉప్పెన రిలీజ్ కాకుండా కృతిశెట్టి... నాని, సుధీర్ బాబు సినిమాలకు సైన్ చేస్తే.. తర్వాత రామ్ - లింగు స్వామి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకుండానే కేతిక కూడా నాగ శౌర్య నటిస్తున్న 'లక్ష్య', వైష్ణవ్ తేజ్ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలు కాకుండా ఇద్దరి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ మరికొన్ని ఉన్నట్టు సమాచారం. ఇద్దరిలో ఎక్కువ సినిమాలు కమిటయింది మాత్రం కృతిశెట్టినే అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో యంగ్ హీరోలతో నటించేందుకు ఇద్దరి మధ్య ఖచ్చితంగా గట్టి పోటీ ఉండటం ఖాయమంటున్నారు. చూడాలి మరి లాంగ్ టైం ఇండస్ట్రీలో ఎవరు కొనసాగుతారో.