Abn logo
Oct 22 2021 @ 00:22AM

రేపు ధర్మపథం కార్యక్రమం ప్రారంభం

శ్రీకాళహస్తి, అక్టోబరు 21: శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలో శనివారం ధర్మపథం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అందులో భాగంగా రాష్ట్రంలో మొదట ప్రధాన ఆలయాల్లో సూర్యయోగ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.  రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణిమోహన్‌ ఆదేశాల మేరకు ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయాల్లో మునుపటి వలే కళలు, సాంస్కృతిక అంశాలు చేపడుతున్నట్లు తెలియజేశారు.  ఆయుర్వేదం, యోగ సాధనపై కూడా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శనివారం ఉదయం 7.30గంటల నుంచి 11.30గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యోగా గురువులు, సాధకులు హాజరై సూర్య నమస్కారాలు, ఆసనాల ప్రదర్శన చేస్తారని పేర్కొన్నారు.  ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తారని వివరించారు.  సాంస్కృతి కార్యక్రమాలు  ఉంటాయని పేర్కొన్నారు. కళలకు, ఆరోగ్యానికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవదాయశాఖ సలహాదారు, ఆయుర్వేద, యోగా నిపుణులు డాక్టర్‌ మాణికేశ్వరరావు, సూర్యయోగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కరణం లుగేంద్రపిళ్లై హాజరు కానున్నట్లు వివరించారు.