Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు, రేపు రైళ్లు రద్దు

(పలాస/ఆమదాలవలస, డిసెంబరు 2)

జవాద్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే శాఖ అప్రమత్తమైంది. శుక్ర, శనివారాల్లో భువనేశ్వర్‌, విశాఖపట్నం మార్గంలో రాకపోకలు సాగించే వివిధ రైళ్లను రద్దు చేసింది. రద్దయిన రైళ్ల వివరాలను వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రకటించారు.


 3న రద్దయిన రైళ్లు:

పూరి-గుణుపూర్‌ (18417), భువనేశ్వర్‌-రామేశ్వరం (20896), హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నూమా (12703), పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ (22883), హౌరా-యశ్వంత్‌పూర్‌ దురంతో (12245), భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), పురులియా-విల్లుపురం (22605), పూరి-తిరుపతి (17479), హౌరా-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045), హౌరా-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), హౌరా-మైసూరు (22817), సంత్రాగచ్చి-చెన్నై (22807), డిఘా-విశాఖ (22873), హౌరా-యశ్వంత్‌పూర్‌ (12863), హౌరా-చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12839), పాట్నా-ఎర్నాకులం (22644), రాయగడ-గుంటూరు (17244), సంబల్‌పూర్‌-నాందేడు (20809), కూర్బా-విశాఖపట్నం (18517), ధన్‌బాద్‌-అలెప్పీ (13351), టాటా-యశ్వంత్‌పూర్‌ (12889), పూరి-అహ్మదాబాద్‌ (12843), భువనేశ్వర్‌-జగదల్‌పూర్‌ (18447), చెన్నై-హౌరా (12842), హైదరాబాద్‌-హౌరా (18046), చెన్నై-భువనేశ్వర్‌ (12849), యశ్వంత్‌పూర్‌-హౌరా దురంతో (12864), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12704), తిరుపతి-పూరి (17480), యశ్వంత్‌పూర్‌-హౌరా (12864), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), చెన్నై-హౌరా మెయిల్‌ (12840), వాస్కోడిగామా-హౌరా (18048), తిరుచురాపల్లి-హౌరా (12664), బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18464), ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019), విశాఖ-కూర్బా (18518), విశాఖ-రాయగడ (18528), గుంటూరు-రాయగడ (17243), జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌ (18448), జునాగర్‌రోడ్డు-భువనేశ్వర్‌ (20838), విశాఖ-భువనేశ్వర్‌ (22820), విశాఖ-పలాస (18532), సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా (22832), బెంగళూరు-అగర్తాలా (02983), అగర్తాలా-సికింద్రాబాద్‌ (07029) 


 4న రద్దు కానున్న రైళ్లు 

భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463), హటియా-బెంగళూరు (18637), భువనేశ్వర్‌-విశాఖ (22819), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గుణుపూర్‌-పూరి (18418), విశాఖ-నిజాముద్దీన్‌ (12807), విశాఖ-కిరండోల్‌ (18551), గుణుపూర్‌-విశాఖ (08522), పలాస-విశాఖ (18531)

Advertisement
Advertisement