Abn logo
Apr 2 2020 @ 06:28AM

నేడే శ్రీరామ నవమి

  •  కనిపించని సందళ్లు, పందిళ్లు.. 
  • భక్తులు లేకుండానే భద్రాద్రి వేడుక.. 
  • తిరుమలలో నవమి ఆస్థానం   
  • సంధించిన రామబాణం తొలగించును సకల కష్టం   

అమరావతి: నేడే... శ్రీరామ నవమి!  ఊరూ, వాడా పందిళ్లు వెలిసి... సందళ్లు నెలకొనాల్సిన వేళ ఇది! కానీ... రాష్ట్రాన్నీ, దేశాన్నీ ‘కరోనా రక్కసి’ కమ్మివేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పండుగ ఇంటికి మాత్రమే పరిమితమవుతోంది. తెలుగు వారందరూ కనులారా చూడాలనుకునే భద్రాచల సీతారాముల కల్యాణాన్ని గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో సామాన్య భక్తులకు అనుమతి ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకలన్నింటినీ ఏకాంతంగానే నిర్వహిస్తారు. ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరుగుతుంది. ఇక్కడ పున్నమి రోజున సీతారామ కల్యాణం నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
Advertisement