Abn logo
Sep 23 2020 @ 10:54AM

ఈ రోజు నుంచి తొలి అండర్‌గ్రౌండ్ మెట్రో సేవలు ప్రారంభం

Kaakateeya

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈరోజు నుంచి మెట్రో తన నూతన సేవలను ప్రారంభించనుంది. స్థానికులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తొలి అండర్‌గ్రౌండ్ మెట్రో సేవలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బడీ చౌపడ్ నుంచి మెట్రో ప్రయాణం ప్రారంభం కానుంది. దీనికి ముందు ఉదయం 12 గంటలకు సీఎం అశోక్ గహ్లోతా, మంత్రి శాంతిధారీవాల్ తదితరులు మెట్రో వర్చువల్ ప్రారంభోత్సవం చేయనున్నారు. 


ఈ కార్యక్రమంలో మెట్రో సీఎండీ భాస్కర్ తదితరులు పాల్గొననున్నారు. సాయంత్రం నుంచి ప్రారంభంకానున్న మెట్రో సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. ఈ మెట్రో బడీచౌపాడ్ నుంచి మానస్ సరోవర్ వరకూ ప్రయాణం సాగించనుంది. ఇందుకోసం కేవలం ఆరు రూపాయలు వసూలు చేయనున్నారు. 11.3 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గాన్ని మెట్రో 26 నిముషాల్లో కవర్ చేయనుంది. ఈ మెట్రో ప్రాజెక్టును రూ. 3,149 కోట్ల వ్యయంతో చేపట్టారు.

Advertisement
Advertisement
Advertisement