Abn logo
Sep 19 2020 @ 12:35PM

జుట్టు రాలడం తగ్గాలంటే!

ఆంధ్రజ్యోతి(19-09-2020)

జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే రోజూ గ్రీన్‌ టీ తాగండి. జుట్టు రాలడం ఆగిపోతుంది. గ్రీన్‌ టీలోని గుణాలు కురులను దృఢంగా చేస్తాయి  అంటున్నారు నిపుణులు.


 జుట్టు రాలడానికి డాండ్రఫ్‌ ఒక కారణం. గ్రీన్‌ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి తోడ్పడతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.


 బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. దీంతో జుట్టు రాలుతుంది. గ్రీన్‌ టీతో జుట్టు కడుక్కోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌లు తొలగిపోతాయి.


 హెయిర్‌ఫాల్‌ను నియంత్రించడంలో సాయపడే  విటమిన్‌-బి గ్రీన్‌ టీ సమృద్ధిగా లభిస్తుంది. 


Advertisement
Advertisement