Abn logo
Mar 6 2021 @ 12:21PM

పోలీస్‌లు తీసుకెళ్ళి చితకబాదారు..!

తిరుపతి : ఒక వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తగాదాలో తనను అన్యాయంగా పోలీసులు తీసుకెళ్ళి చితకబాదారని సుబ్బారెడ్డి నగర్‌ నివాసి బియ్యం వ్యాపారి జి.రెడ్డప్ప కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు తన ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లును బలవంతంగా తీసుకున్నారన్నారు. ఖాళీ డాక్యుమెంట్లు, తెల్ల పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైమ్‌ పోలీసులు తనను స్టేషన్‌కు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి, కొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు.


Advertisement
Advertisement
Advertisement