Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీటీడీ భవనం దగ్గర ఉద్రిక్తత.. సీఎం టాటూతో మహిళ నిరసన

తిరుపతి: టీటీడీ పరిపాలన భవనం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికులు ఆరు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు నిరసన తెలుపుతున్నారు.


గురువారం సాయంత్రం మూడు గంటలకు సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఓ కార్మికురాలు తన చేతిపై ముఖ్యమంత్రి పచ్చబొట్టు పొడిపించుకుంది. ఆమె కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆరు రోజులుగా నిరసన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, పైగా తాము వాష్ రూమ్‌కు వెళ్లకుండా తాళాలు వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన ఆపేది లేదని, పోలీసులు కొట్టినా.. జైల్లో పెట్టినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేసింది. జగనన్నకు ఇది న్యాయం కాదని, ఇప్పటికైన తమ సమస్యలు పరిష్కరించాలని మహిళలు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement