Abn logo
Sep 21 2021 @ 08:21AM

ఎరువాడ జోడు పంచెలు తిరుమలకు చేరుకోవడంపై సందిగ్ధం

తిరుమల: ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గద్వాల్ సంస్థానం వారు సమర్పించే ఎరువాడ జోడు పంచెలు తిరుమలకు చేరుకోవడంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఎరువాడ జోడు పంచెలను గద్వాల్ సంస్థానదీశులు సిద్ధం చేశారు. టీటీడీ పిలుపు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఎంతటికీ టీటీడీ నుంచి పిలుపు రాకపోవడంతో గద్వాల్ సంస్థానం తరుపున టీటీడీని సంప్రదించింది. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైంది. వచ్చే నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అనాది కాలంగా వస్తున్న సంప్రదాయాలను పాటించకపోవడంపై టీటీడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం, పాలకమండలి స్పందించి ఎరువాడ జోడు పంచెలను శ్రీవారికి సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని గద్వాల్ సంస్థనాదీశులు కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption