Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమల ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

తిరుమల రెండవ ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. 14వ కిలోమీటరు వద్ద పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అటువైపు ఎలాంటి వాహన రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడడంతో రోడ్డు కుంగిపోయింది. దీంతో టీటీడీ అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్‌లోనే రాకపోకలు కొనసాగుతున్నాయి. టీటీడీ ఇంజనీరింగ్, అటవి విజిలెన్స్ సిబ్బంది కలిసి జేసీబీల సాయంతో కొండ చరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్డులో నిలిచిపోయిన వాహనాలను వెనక్కి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement