Abn logo
Feb 24 2021 @ 01:17AM

టై అండ్‌ డై లుక్‌..

ప్రతి ఏడాది కొన్ని ట్రెండింగ్‌ దుస్తులు ఫ్యాషన్‌ రంగంపై చెరగని ముద్ర వేస్తాయి. ప్రస్తుతం టై అండ్‌ డై డ్రెస్సింగ్‌ ఫ్యాషన్‌ ప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ సరికొత్త దుస్తుల్లో స్టయిల్‌గా, ష్యాషన్‌గా కనిపించేందుకు ఏం చేయాలంటే...


  1. టై అండ్‌ డై క్లోత్స్‌ ధరించాలనుకునే వారు మీకు ఇష్టమైన జీన్స్‌ మీదకు టీషర్ట్‌ లేదా టాప్‌ ఎంచుకోవాలి. అన్ని రకాల డిజైన్లు, రంగుల టీషర్ట్‌, టాప్‌లకు చక్కగా మ్యాచ్‌ అవుతుంది. ఈ రకం డ్రెస్సింగ్‌కు తెలుపు రంగు స్నీకర్స్‌ పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌. 
  2. టై డై స్కర్ట్‌ మీదకు తెల్లని టీషర్ట్‌ ఎంచుకోవాలి. కాళ్ల వరకూ ఉండే టై అండ్‌ డై డ్రెస్సింగ్‌కు హీల్స్‌, స్నీకర్స్‌ మంచి లుక్‌నిస్తాయి. టై అండ్‌ డై డ్రెస్‌ను జంప్‌సూట్‌గా ధరించేవాళ్లు జ్యూట్‌ బ్యాగ్‌, టోపీ, సన్‌గ్లాసెస్‌ వంటి యాక్సెసరీస్‌ ఉపయోగిస్తే స్టయిల్‌గా కనిపిస్తారు.

Advertisement
Advertisement
Advertisement