Abn logo
Oct 15 2021 @ 01:18AM

అమరావతికే అందరి మద్దతు

పెదపదరిమి శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

667వ రోజుకు చేరుకున్న రాజధాని ఉద్యమం

  

తుళ్ళూరు, అక్టోబరు 14: అమరావతి రాజధానికే రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందని భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం గురువారం 667వ రోజుకు చేరుకుంది. ఆయా శిబిరాల్లో మహిళలు, రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ మూడు రాజధానులు కావాలని ఎవరూ అడగలేదన్నారు. ప్రజల నిర్ణయం మేరకు ప్రభుత్వం పని చేయాలని సూచించారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టటానికి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై.. అమరావతి అంటూ నినాదాలు చేశారు.  అమరావతికి వెలుగును ప్రసాదించాలని న్యాయదేవతను వేడుకున్నారు