Abn logo
Jul 15 2020 @ 08:37AM

ఆలియా భ‌ట్ సోద‌రికి బెదిరింపులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం సీరియ‌స్ టాపిక్ అయ్యింది. క‌పూర్‌, ఖాన్స్, భ‌ట్ ఫ్యామిలీ స‌భ్యుల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పూజా భ‌ట్‌, కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య అయితే సోష‌ల్ మీడియాలో మాట‌ల యుద్ధ‌మే జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఆలియా భ‌ట్ సోద‌రి షాహిన్‌కి నెటిజ‌న్స్ నుండి బెదిరింపులు వ‌చ్చాయట‌. అత్యాచారం చేస్తామ‌ని, చంపేస్తామ‌ని కొంద‌రు బెదిరించారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న షాహిన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు. స‌ద‌రు బెదిరింపుల‌ను క్లిప్స్ రూపంలో తీసుకున్నాన‌ని, బెదిరింపు దారుల‌ను ఐపీ అడ్ర‌స్‌ల ద్వారా ప‌ట్టుకుని శిక్షిప‌డేలా చేస్తాన‌ని షాహిన్ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement