Abn logo
Sep 26 2020 @ 04:20AM

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురికి రిమాండ్‌

చార్మినార్‌, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ. 6,700 స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఎత్తెబార్‌ చౌక్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌, రాయల్‌ చాలెంజ్‌ బెంగలూరు మధ్య జరిగిన ఐపీఎల్‌ 2020 పోటీపై బెట్టింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. షరీఫ్‌ అహ్మద్‌ ఇంటిపై దాడి చేసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్న షరీఫ్‌ అహ్మద్‌, మహ్మద్‌ యూసుఫ్‌, సయ్యద్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
Advertisement
Advertisement