Abn logo
Mar 4 2021 @ 06:52AM

విదేశీ కాల్స్‌.. ఇక్కడ లోకల్‌.. ముగ్గురు అరెస్ట్‌

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌ : భారత టెలికాం సంస్థ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొడుతున్న ముగ్గురు కేటుగాళ్లను  పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. వివరాలను రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఆర్‌.సంజయ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య వెల్లడించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ సంస్థ వారి ఫిర్యాదు మేరకు సెల్వా టెక్నాలజీస్‌పై పోలీసులు దాడులు చేశారు. సంస్థ నిర్వాహకుడు స్థానికంగా ఉండే ఐటీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న మహ్మద్‌ అశ్వాక్‌(23), సయ్యద్‌ మహ్మద్‌ నజీర్‌(30), షేక్‌ అక్బర్‌(25)లు విదేశీ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చుతున్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విదేశీకాల్స్‌ లోకల్‌ కాల్స్‌గా మారే విధానం ఉగ్రవాదులకు తెలిస్తే మరింత ప్రమాదమని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement