Abn logo
Aug 7 2020 @ 03:13AM

కారు తీసిన ఉసురు

  • ఆగిన ముగ్గురు పిల్లల ఊపిరి
  • ఆటల్లో పొరపాటున కారు లాక్‌
  • డోర్లు పడి ఉక్కిరిబిక్కిరి.. మృతి
  • హనుమాన్‌జంక్షన్‌లో విషాదం


హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ ఆగస్టు 6: అప్పటి వరకూ కారులో ముగ్గురు చిన్నారులు హుషారుగా ఆడుకున్నారు. ఇంతలో పొరపాటున కారు లాక్‌ పడిపోయింది. డోర్లు మూసుకుపోయాయి. శ్వాస కష్టమయి గంటకుపైగా పిల్లలు ఉక్కిరిబిక్కిరై కారులోనే ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాజిల్లా హనుమాన్‌జంక్షన్‌ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. అస్సోం, పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చిన వలస కార్మికుల కుటుంబాలు కొన్ని మోహన్‌ స్పింటెక్స్‌ కార్మాగారంలో పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నాయి. ఆ కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు గురువారం సాయంత్రం బయటకు వచ్చారు. చీకటి పడుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. ఇంతలో అక్కడ నిలిపిఉన్న కారు కనిపించింది. డోర్లు వేసిన ఆ కారులోకి తొంగిచూడగా, ముగ్గురూ చనిపోయి కనిపించారు. కారు లాక్‌ పడిపోవడంతో బయటకురాలేక లోపల గాలి అందక మృతిచెందారు. మృతులను హఫ్సానా (6) యాస్మిన్‌(6) సుహాన పర్వీన్‌(7)గా గుర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement