Abn logo
Oct 14 2021 @ 00:26AM

ఇరు వర్గాల ఘర్షణలో మూడు కేసుల నమోదు

పది మందితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు
గొడవను అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై దాడికి యత్నం
విధులను ఆటంకపరిచారని కానిస్టేబుల్‌ ఫిర్యాదు
బాధితుడి అన్న పోలీసుస్టేషన్‌ ఎదుట వీరంగం
వాహనదారులను అడ్డుకున్నందుకు కేసు నమోదు
కామారెడ్డి, అక్టోబరు 13: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో రెండు గ్రూప్‌ల విద్యారుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసిన సంఘటన ఇది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌కే లాడ్జి రోడ్డుపై మంగళవారం సాయంత్రం మహేష్‌తో పాటు దినేష్‌, సోఫియొద్దీన్‌లతో పాటు మరికొంత మంది ఘర్షణ పడ్డారు. అనంతరం ఎస్‌సీ కాలనీ సమీపంలో మరోసారి గొడవపడ్డారు. తర్వా త జేపీఎన్‌ చౌరస్తా దుర్గామాత మండపం వద్ద దాండియా ఆడుతున్న సమీపంలో బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు గొడవప డ్డ ఇరువర్గాల వారు మరోసారి తారసపడడంతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో సోఫియోద్దీన్‌, భార్గవ్‌, సాయి నితిన్‌లతో పాటు మరికొంత మంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సోఫియోద్దీన్‌ అన్న ఇమ్రాన్‌ 50 మందితో కలిసి ఘర్షణ పడేందుకు వచ్చాడు. తమ్మునిపైన దాడి చేసిన వారిని చంపుతామంటూ రోడ్డుపై ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగించాడు. అంతేకాకుండా దుర్గామాత మండపం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అనిల్‌రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు మరో 50 మంది కలిసి పోలీసుస్టేషన్‌ వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల నిర్లక్ష్య ం వల్లనే తన తమ్మునిపై మరికొంత మందిపై దాడి జరిగిందని ఇమ్రాన్‌ ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు కేసులు నమోదు చేశారు. మహేష్‌తో పాటు చందు, దినేష్‌, సోఫియోద్దీన్‌ల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో మధుసూదన్‌ తెలిపారు. మహేష్‌ అతని ఇద్దరి స్నేహితులపై కేసు నమోదు చేయడం తో పాటు తరుణ్‌, నిషాంత్‌, గోపి, భార్గవ్‌, సాయి నితిన్‌, ఇమ్రాన్‌ మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దుర్గామాత మండపం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అనిల్‌రెడ్డిపై దాడికి యత్నించి విధులకు ఆటంక పరిచినందుకు ఆయన ఫిర్యాదు మేరకు ఇమ్రాన్‌ మరికొంత మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో తెలిపారు. చిలికిచిలికి గాలివానల కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి ఇరువర్గాల ఘర్షణలో మూడు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

పందుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారు పెంచుకుంటున్న పందుల విషయంలో గొడవ పడి కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నట్లు దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. దాడిలో గాయపడిన రాజు, నవీన్‌లు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.