తమిళ నటుడు విజయ్‌సేతుపతి, సమంత, నయనతార ముఖ్యపాత్రల్లో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘కాట్టువాక్కుల రెండు కాదల్’. ఈ చిత్రం ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ‘కాట్టువాక్కుల రెండు కాదల్’ చిత్రంలో తాను ఓ ఫన్నీ క్యారెక్టర్ చేస్తున్నట్టు, ఆ పాత్ర కథలో కీలకంగా ఉంటుందని సమంత గతంలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ వాయిదాపడింది. నిర్మాత లలిత్‌కుమార్‌తో కలసి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ‘నానుమ్ రౌడీ ధాన్’ తరువాత సేతుపతితో ఆయనకు ఇది రెండో చిత్రం.