Abn logo
Jul 15 2020 @ 11:04AM

ఆ ముగ్గురు.. ఈ ముగ్గురు..

హైదరాబాద్: పాతతరం పోతోంది.. కొత్త తరం వస్తోంది. ఎప్పటికప్పుడు దానికి తగినట్లు నడవకపోతే వ్యక్తులైనా వ్యవస్థలైనా కుదేలవ్వడం ఖాయం. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం మారుతున్న తరాలకు అనుగుణంగా మారకపోతే ఆ రాజకీయ పార్టీ కూడా కాలక్రమంలో మెల్ల మెల్లగా కలిసిపోతుంది. అందుకు ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. అసలు జాతీయ స్థాయిలో పార్టీకి నాయకత్వం ఎవరు తీసుకోవాలో ఇంత వరకు స్పష్టత లేదు. 


ఇలాంటి తరుణంలో చాలా పార్టీలు యువనాయకులు దొరక్కా సతమతమవుతున్నాయి. మంచి నాయకులను కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంటోంది. అందుకు తాజాగా రాజస్థాన్‌లో జరుగుతున్న వ్యవహారం చూడొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీని చూస్తే.. మాధవరావు సింథియా, రాజేష్ పైలట్,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ ముగ్గురికి సారుప్యతలు ఉన్నాయి. వారు పార్టీల్లో తమ తమ రాష్ట్రాల్లో రెబల్ లీడర్స్‌గా ఉన్నా.. స్థానిక నాయకత్వాలపై తిరుగుబాటు చేసినా.. అధిష్టానానికి మాత్రం విధేయులుగా ఉండేవారు. పార్టీని బలోపేతం చేస్తూ, తమ ఉనికిని కాపాడుకునేవారు. ఆ ముగ్గురికి ముగ్గురు వారసులు ఉన్నారు. వారిని సరిగ్గా కాంగ్రెస్ వాడుకుంటే మూడు రాష్ట్రాలు బలంగా ఉండేవి. 


ఆంధ్రప్రదేశ్.. వైఎస్ మరణం తర్వాత జగన్ అధికారం ఇవ్వమని కోరినా పార్టీ ఒప్పుకోకపోవడంతో ఆయన సొంతపార్టీ పెట్టి ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మాధవరావు సింధియా కుమారుడు జ్యోతి రాధిత్య సింధియాను పార్టీ సరిగా గుర్తించకపోవడం.. కమల్‌నాథ్‌ను సిఎం చేయడంతో జ్యోతి రాధిత్య అలిగి బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్.. సచిన్ పైలట్‌కు నాయకత్వం ఇవ్వకుండా గెహ్లాట్‌కు సీఎం పదవి ఇచ్చి.. సచిన్ పైలట్‌కు డిప్యూటీ సీఎం, పీసీసీ పదవి ఇచ్చింది. అప్పటి నుంచే రాష్ట్రంలో అసమ్మతి నెలకొంది. ఆ ప్రభుత్వం ఇప్పుడు కొన ఊపిరితో ఉంది. దీనికి సచిన్ పైలట్‌ కారణంగా భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయను పదవుల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇప్పుడు సచిన్ పైలట్‌‌కు బీజేపీ రెడ్ కార్పెట్ వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ నాటి ఆ ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీకి పిల్లర్స్‌గా నిలిచారు. ఈనాటి ఈ ముగ్గురు పార్టీని దెబ్బకొట్టారు. ఇది పార్టీ లోపామా? అధికారం కోసం రాజకీయ పోకడలా? ఈ వీడియో చూడండి..

Advertisement
Advertisement
Advertisement