Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫొటోలకు నగ్నంగా ఫోజులిచ్చిన మహిళలకు దేశ బహిష్కరణ!

దుబాయ్: కొందరు ఉక్రెయిన్ మహిళలు ఓ భవనం బాల్కనీలో నిల్చుని నగ్నంగా ఫోజులిచ్చిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిని గుర్తించి దుబాయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా గుర్తించిన 11 మంది ఉక్రెయిన్ మహిళలను దేశం నుంచి బహిష్కరించినట్లు మంగళవారం అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. చాలా మంది మహిళలు నగ్నంగా పట్టపగలు ఓ ఎత్తైన భవనం బాల్కనీలో నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. రష్యన్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో మహిళలను చిత్రీకరించాడు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫొటోలలో ఉన్న వారందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ గుంపులోని 11 మంది ఉక్రెయిన్ మహిళలను దేశం నుంచి బహిష్కరించారు. కాగా, పోలీసుల విచారణలో పబ్లిసిటీ కోసమే ఈ పని చేసినట్టు నిందితులు చెప్పారని సమాచారం. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement