Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 1 2021 @ 19:24PM

ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులో...

న్యూఢిల్లీ : ఈ(అక్టోబరు) నెలలో బ్యాంకులు ఎక్కువ రోజులు మూసివేసే ఉండనున్నాయి. ఈ నెలలలో బ్యాంకులకు ఏకంగా 21 సెలవులు వచ్చాయి. వీటిలో14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. ఇదిలా ఉంటే కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ఉంటాయి. ఇక సెలవుల వివరాలిలా ఉన్నాయి. 


అక్టోబరు 1 – అర్ధ సంవత్సర క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (గ్యాంగ్‌టక్), 

అక్టోబరు 2 – గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాల్లో సెలవు), 

అక్టోబరు 3 – ఆదివారం, 

అక్టోబరు 6 – మహాలయ అమావాస్య (అగర్తల, బెంగళూరు, కోల్‌కతా), 

అక్టోబరు 7 – మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్‌తో సనామహి (ఇంపాల్), 

అక్టోబరు 9 – రెండో శనివారం, 

అక్టోబరు 10- ఆదివారం, అక్టోబర్ 12- దుర్గా పూజ (అగర్తల, కోల్‌కతా).

అక్టోబరు 13- మహాష్టమి (పలు రాష్ట్రాల్లో), అక్టోబరు 14 – దుర్గా పూజ (పలు రాష్ట్రాల్లో), అక్టోబరు 15 – దసరా ( ఇంపాల్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలో సెలవు), 

అక్టోబరు 16 – దుర్గా పూజ (గ్యాంగ్‌టక్), అక్టోబరు 17- ఆదివారం, 

అక్టోబరు 18- కటి బిహు (గువాహతి), అక్టోబరు 19 – ఈద్ ఇ మిలాద్ ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు), 

అక్టోబరు 20- మహర్షి వాల్మికి పుట్టిన రోజు (పలు రాష్ట్రాల్లో), 

అక్టోబరు 22 – ఈద్ ఇ మిలాద్ (జమ్మూ శ్రీనర్), 

అక్టోబరు 23 – నాలుగో శనివారం, 

అక్టోబరు 24 – ఆదివారం, 

అక్టోబరు 26 – అసెషన్ డే (జమ్మూ శ్రీనగర్), అక్టోబర్ 31 – ఆదివారం.

బ్యాంకులకు అక్టోబరు నెలలో ఇలా మొత్తం 21 రోజులు సెలవులు వచ్చాయి.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement