Advertisement
Advertisement
Abn logo
Advertisement

పటిష్టంగానే ఘాట్ రోడ్‌: ఢిల్లీ ఐఐటీ

తిరుమల: తిరుమలలోని ఘాట్ రోడ్‌ పటిష్టంగానే ఉందని ఐఐటీ నిపుణుడు కేఎస్ రావు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో తిరుమల ఘాట్‌లో ఢిల్లీ ఐఐటీ బృందం పర్యటించింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. 12 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని బృందం తెలిపింది. కొండచరియలు విరిగి పడకుండా త్వరలో శాశ్వత చర్యలు తీసుకోవాలని టీటీడీకి సూచించింది. ఊహించని విధంగా వర్షం కురవడంతో 40 నుంచి 50 టన్నుల బరువుగల కొండచరియలు పడ్డాయని బృందం తెలిపింది. అయినా ఘాట్ రోడ్‌ పటిష్టంగానే ఉందని తెలిపింది. రాక్ ఫాల్స్ కారణంగానే రోడ్‌ డ్యామేజ్‌ అయ్యిందని పేర్కొంది. భవిష్యత్ అవసరాల ద‌ృష్ట్యా మరో రోడ్‌ నిర్మాణం చేయాలని సూచిస్తామని ఐఐటీ నిపుణుడు కేఎస్ రావు తెలిపారు. Advertisement
Advertisement