Abn logo
May 22 2020 @ 20:17PM

ఈ రెండు తేదీలను ఎప్పటికీ మరిచిపోను: నాగార్జున

మే 22 మరియు మే 23 తేదీలను నేను ఎప్పటికీ మరిచిపోలేను అన్నారు కింగ్ నాగార్జున. ఈ రెండు తేదీలు తను ఎందుకు మరిచిపోలేడే కూడా ఆయన వివరణ ఇచ్చారు. మే 22న ‘అన్నమయ్య’, మే 23న ‘మనం’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు నాగార్జున కెరీర్ ఎంత ముఖ్యమైనవో తెలియంది కాదు. అందులో ముఖ్యంగా ‘మనం’ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం. ఆ చిత్రంలో ఆయన నవ్వులు ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఇక ‘అన్నమయ్య’ విషయానికి వస్తే.. ఈ చిత్రం నాగార్జునలోని మరో కోణాన్ని చూపించింది. సాక్షాత్తూ అన్నమయ్యే దిగివచ్చాడా అనేలా నాగార్జున తన అభినయంతో ఈ చిత్రంలో మెప్పించారు. అందుకే ఈ రెండు చిత్రాలు తనకు ఎంతో స్పెషల్ అని నాగార్జున ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 


‘‘మే 22, మే 23.. ఈ రెండు తేదీలను నా జీవితంలో మరిచిపోలేను. రెండు మరపురాని క్లాసిక్ సినిమాల విడుదల తేదీలివి. ‘అన్నమయ్య, మనం’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విక్రమ్ కుమార్‌లకు కృతజ్ఞతలు..’’ అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement