Jul 29 2021 @ 02:28AM

పెళ్లి వార్తల్లో నిజం లేదు

దక్షిణాది కథానాయిక త్రిష త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతు న్నారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను  ఆమె పీఆర్‌ టీమ్‌ ఖండించింది. చెన్నైకు చెందిన సినిమా దర్శకుడితో త్రిష ఏడడుగులు వేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. గతంలో వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగాక, పెళ్లి రద్దయింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ షూటింగ్‌లో త్రిష పాల్గొంటున్నారు.