Abn logo
Sep 30 2020 @ 02:24AM

మాస్టర్‌ ప్లాన్‌ ఏమీ లేదు

Kaakateeya

శ్రుతీహాసన్‌ తెలుగు, హిందీ సినిమాల్లో కనిపించి మూడేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘క్రాక్‌’, వకీల్‌సాబ్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారు. మూడేళ్లు హిందీ తెరకు దూరంగా ఉండడం వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఏమీ లేదని శ్రుతీహాసన్‌ అంటున్నారు. ‘‘పరిశ్రమలో పదేళ్లుగా నటిగా కొనసాగుతున్నానంటే నేను ఎంచుకున్న కథలే అందుకు కారణం. మధ్యలో చాలామంది కమర్షియల్‌ సినిమాలే చేయమని సలహా ఇచ్చారు. ఆ తరహా సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్నా. ఇప్పుడు అలాంటి మాటలు వినదలుచుకోలేదు. కథల విషయంలో ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నా. రానున్న రెండు నెలల్లో నాన్‌స్టాప్‌గా పనిచేసి తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్‌ పూర్తి చేయాలనుకుంటున్నా. ఇక హిందీ సినిమాల విషయానికొస్తే.. అక్కడ సినిమాలు చేయకపోవడం వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఏమీ లేదు. అంగీకరించిన తెలుగు, తమిళ సినిమాలను కూడా బ్యాలెన్స్‌ చేయాలి కాబట్టి కొంత గ్యాప్‌ ఇచ్చా. హిందీలో ఎగ్జైటింగ్‌ క్యారెక్టర్‌ కోసం చూస్తున్నా. దక్షిణాదిలోనే నాకు మంచి పాత్రలు దక్కుతున్నాయి.’’


లాక్‌డౌన్‌ సమయమంతా ఒంటరిగా ఉండడం కంఫర్ట్‌గా అనిపించలేదు. ఇది నాకు బ్రేక్‌లా లేదు. నిర్బంధంలా అనిపించింది. అయితే ఈ సమయంలో ఎవరి సహకారం లేకుండా నేను నాలాగా ఉన్నా. ఆరు నెలల కాలంలో సంగీతం మీద నాకెంత ప్రేముందో మరోసారి తెలిసింది. 


వృత్తిరీత్యా నాన్న అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నా. పని పట్ల ఆయన నిబద్ధత, వరల్డ్‌ సినిమాను ఆయన ఎంతగా ఇష్టపడతారో నాకు తెలుసు. తనలోని క్రియేటివిటీని బయటపెట్టాలని నిరంతరం తపనపడుతుంటారు. 


మన దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉండే నాయికలంటే చాలా ఇష్టం. 80 ఏళ్ల వయసులో కూడా వారు సినిమాల్లో యాక్ట్‌ చేస్తుంటారు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలన్న తపన ఉన్నవారే అలా చేయగలరు. 


Advertisement
Advertisement
Advertisement