Abn logo
Oct 6 2020 @ 09:58AM

బంధువుల ఇంట్లోనే చోరీ చేశాడు.. ఆపై ఏమీ తెలియనట్లు..

Kaakateeya

హైదరాబాద్ : బంధువుల ఇంట్లో నగదు, బంగారు నగలు అపహరించి తప్పించుకుతిరిగుతున్న ఓ యువకుడ్ని గాంధీనగర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుంచి ఐదున్నర తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. బండ్‌మైసమ్మనగర్‌లో నివాసం ఉండే ప్రభాకర్‌ తన ఇంట్లో బీరువాలో ఉన్న 8.5తులాల బంగారు నగలు, 12వేల నగదు చోరీ అయ్యాయి. ఈనెల 2న ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రభాకర్‌ ఇంటికి ఎవరెవరు వస్తారో పోలీసులు తెలుసుకున్నారు. నాగోల్‌లో నివాసం ఉండే మంగలి భాస్కర్‌(20) వృత్తి రీత్యా జిమ్‌లో కోచర్‌. ప్రభాకర్‌కు బంధువు అవుతాడు. కొంతకాలంగా ప్రభాకర్‌ ఇంటికి భాస్కర్‌ వచ్చి వెళుతున్నాడు. బండమైసమ్మనగర్‌లో నివాసం ఉండే వారి బాబాయ్‌ ఇంటికి వచ్చిన భాస్కర్‌ను పోలీసులు తమ వ్యూహంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఈనెల రెండో తేదీన రూ.12వేల, సెప్టెంబర్‌  10వ తేదీన అల్మారాలో ఉన్న 8.5 తులాల బంగారు నగలు అపహరించినట్లు నేరం అంగీకరించాడు. దీంతో అతని వద్దనుంచి 5.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు గాంధీనగర్‌ డీఐ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement