Abn logo
Aug 6 2020 @ 00:31AM

తాళం వేసిన ఇంట్లో చోరీ

3 తులాల బంగారం, 4 తులాల వెండి అపహరణ


మోమిన్‌పేట : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మోమిన్‌పేట మండలం వెల్‌చాల్‌ గ్రామానికి చెందిన బేగరి లక్ష్మి, ఉదయం పొలం పనులకు వెళ్లింది. కొడుకు రాజు, కోడలు రాఖీ కట్టడానికి ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో లక్ష్మి పొలం నుంచి ఇంటికి రాగా తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న  3 తులాల బంగారం, 4 తులాల వెండిని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. డీఎస్పీ సంజీవరావు, సీఐ నగేష్‌, ఎస్‌ఐ రవికుమార్‌లు డాగ్‌ స్క్వాడ్‌తో వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement