Abn logo
Jul 28 2021 @ 16:34PM

పెళ్లి తర్వాత ఊళ్లో అడుగుపెట్టిన జంటకు ఊహించని షాక్.. రూ.2.5 లక్షల జరిమానా..!.

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఊరి నుంచి ఢిల్లీ వెళ్లిపోయి పెళ్లి చేసుకుని అక్కడే జీవనం సాగించారు.. ఏడాది తర్వాత గ్రామానికి తిరిగి వస్తే పెద్దలు వారికి ఊహించని షాక్ ఇచ్చారు.. కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో వారికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తర్వాతే ఊరిలో అడుగు పెట్టాలని ఆదేశించారు. దీంతో సదరు జంట పోలీసులను ఆశ్రయించింది. బీహార్‌లోని పునియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


చంపానగర్‌కు చెందిన లడ్డూ సింగ్, సోనీ గతేడాది గ్రామం నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఢిల్లీలో కాపురం పెట్టారు. తాజాగా సోనీ గర్భం దాల్చింది. దీంతో వారిద్దరూ గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో గ్రామ పెద్దలు వారిని ఊళ్లోకి రానివ్వలేదు. రూ.2.5 లక్షలు పంచాయితీకి జరిమానాగా కడితేనే గ్రామంలోకి రానిస్తామని తీర్పునిచ్చారు. ఈ మేరకు లడ్డూ సింగ్ తండ్రి, సోనీ తండ్రి నుంచి బాండ్ కూడా రాయించుకున్నారు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...