Abn logo
Jun 4 2020 @ 04:32AM

‘చదువుకోమ్మా...’ అనడమే తప్పయింది!

యువతి ఆత్మహత్య 


కళ్యాణదుర్గం, జూన్‌ 3: ‘ డిగ్రీ పూర్తి చేసి బాగా చదువుకోమ్మా...’ అని సలహా ఇవ్వడమే తప్పనిపించింది ఓ యువతికి. ‘నేను చదువుకోను.. నాకు ఇష్టం లేదు..’ అని మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చే సుకున్న ఘటన కల్యాణదుర్గం మండలంలోని భట్టువానిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భట్టువానిపల్లికి చెందిన రజిని (19) అనే యువ తి ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం కోర్సును మధ్యలోనే మా నేసి తిరుపతికి వెళ్లి ఓ కంపెనీలో పనిచేస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రజిని స్వగ్రామానికి వచ్చింది.


లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో తిరిగి తిరుపతికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ విషయం గమనించిన తల్లి అంజినమ్మ, తమ్ముడు మధులు తాము కూలి పనులైనా చేసి చదివించు కుంటామని... బుద్ధిగా చదువుకో తల్లీ అని ప్రాధేయపడ్డారు. తిరుపతికి వెళ్లవద్దని బ్రతిమలాడారు. చివరకు కళాశాల ప్రారంభం కాగానే వె ళ్లాలని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి రజని తల్లి, సోదరు డు ఉపాధి పనులకు వెళ్లగానే ఇంట్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement