Abn logo
Sep 22 2020 @ 00:00AM

సారా విక్రయించిన మహిళకు ఏడాది జైలు

మహబూబ్‌నగర్‌ క్రైం, సెప్టెంబరు 22: సార విక్రయిస్తున్న మహబూబ్‌నగర్‌ సమీపంలోని పెద్ద తండాకు చెందిన పాత్లావత్‌ వాలికి మంగళవార ఏడాది జైలు శిక్ష విధించారు. పలుమార్లు సారా విక్రయిస్తూ పట్టుబడిన మహిళను తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేయగా, రూ.లక్ష జరిమానా విధించారు. ఆ డబ్బును ఆమె చెల్లించకపోవడంతో ఏడాది పాటు జైలు శిక్ష విధించి, జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సీఐ బాలక్రిష్ణ ప్రభుత్వం సార విక్రయాలను నిషేధించి, విక్రయదారులు ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రుణాలు ఇచ్చిందన్నారు. సార విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement