Abn logo
Jul 28 2021 @ 16:22PM

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. తీసుకురావడానికి వెళ్లిన భర్త.. అక్కడ ఏం జరిగిందంటే..

ఆమె భర్త సోదరుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అతడి ప్రేమలో పడి భర్తను వదిలేసి వెళ్లిపోయింది.. ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యను తీసుకురావడానికి వెళ్లిన భర్తకు అవమానం ఎదురైంది.. దీంతో అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. పంజాబ్‌లోని లూథియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


లూథియానాకు చెందిన జస్వీర్ సింగ్, గగన్‌దీప్ కౌర్ భార్యాభర్తలు. తమ ఇంటికి తరచుగా వచ్చే భర్త సోదరుడు మంగల్ సింగ్‌తో గగన్ దీప్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత మంగల్ సింగ్‌తో కలిసి వేరే వూరికి వెళ్లిపోయింది. భార్య ఆచూకీ తెలుసుకున్న జస్వీర్ అక్కడికి వెళ్లి.. ఇంటికి వచ్చెయ్యమని బతిమాలాడు. అయితే జస్వీర్‌ను మంగల్, గగన్ కలిసి కొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన జస్వీర్ ఇంటికి వచ్చి మంగళవారం నాడు ఉరేసుకుని చనిపోయాడు. దీంతో జస్వీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగల్ సింగ్, గగన్ దీప్ వల్లే తన కుమారుడు చనిపోయాడని కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ విచారిస్తున్నారు.  


ప్రత్యేకంమరిన్ని...