Abn logo
Oct 15 2021 @ 00:02AM

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

చింతలమానేపల్లి, అక్టోబరు 14: అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల ప్రజాపరి షత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, ఎంపీపీ డుబ్బులనానయ్య, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ డోకె రాజన్న, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ భీంకరి నారాయణ, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ తొంబ్రె మారుతి, నీలాగౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.