Abn logo
Aug 7 2020 @ 00:18AM

కమ్ముకొస్తున్న కరోనా

ఉమ్మడి పాలమూరులో విస్తరిస్తున్న వైరస్‌


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/ గద్వాలక్రైం/ అయిజ/ నారాయణపేట క్రైం/ వనపర్తి/ జడ్చర్ల/ దామరగిద్ద/ సీసీకుంట/ తాడూరు/అడ్డాకుల:

పాలమూరులో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్‌ జిల్లాలో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు అత్యధికంగా గురువారం ఒక్కరోజే 94 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అందులో ఒక్క జడ్చర్లలోనే 62 మందికి వైరస్‌ సోకింది. జడ్చర్ల పట్టణంలో 16, రూరల్‌లో రెండు, జిల్లా శిక్షణా కేంద్రంలో 44 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాటు మిడ్జిల్‌ మండలం సింగందొడ్డి ఒక్కటి, బూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో ఒక్కరికి, కొత్తమొల్గరలో ఒకరికి, పోతులమడుగులో ఒకరికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అడ్డాకులలోని శివాజీనగర్‌లో ఒకరికి, జానంపేటలోని నందిపేటలో ఒకరికి,  సీసీ కుంటలోని ఎస్సీ కాలనీలో ఇద్దరికి,  కోయిలకొండలోని పెర్కివీడులో ఒక్కరికి వైరస్‌ సోకింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం 64 కేసులు నమోదైనట్లు తెలిసింది. అందులో గద్వాల పట్టణంలోనే 29 కేసులు నమోదు అయినట్లు తెలిసింది. గద్వాల మండలంలోని మేలచెరువులో రెండు, మానవపాడులో ఒకటి పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అలంపూర్‌లో ఐదుగురికి, గట్టులో ఒకరికి, అయిజ పదమూడు మందికి, ఇటిక్యాల ఏడుగురికి, క్యాతూరులో ఇద్దరికి, ఉప్పేరు ఒక్కరికి, వడ్డెపల్లి ఇద్దరికి, ఉండవల్లి మండలం పుల్లూరులో ఒక్కరికి కరోనా నిర్ధారణ అయ్యింది. 


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గురువారం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మద్దూర్‌ మండల కేంద్రంలో ఇద్దరికి, లక్కాయిపల్లిలో ఒక్కరికి, వీరారం గ్రామంలో మరొకరికి కరోనా సోకింది. దామరగిద్ద మండలంలోని కందెన్‌పల్లి గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఉట్కూరు మండలం చిన్నపొర్లలో ఒకరికి, కొత్తపల్లిలో మరొకరికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట ఎస్సీ వాడకు చెందిన కరోనా బాధితుడు జిల్లా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రంలో ఓ వ్యక్తి గురువారం మృతి చెందాడు. 


వనపర్తి జిల్లాలో గురువారం 23 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో 16 మందికి వైరస్‌ సోకగా, కొత్తకోటలో ఇద్దరికి, గణపూర్‌, ఆత్మకూరు, అమరచింత, చిన్నంబావి, పెద్దమందడిలో ఒకొక్కరి చొప్పున కేసులు నమోదయ్యాయి. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 

Advertisement
Advertisement