Abn logo
May 21 2020 @ 08:00AM

రెండోసారి కరోనా సోకిన వారి నుంచి వైరస్‌ వ్యాపించదు: శాస్త్రవేత్తలు

సియోల్‌, మే 20 : కరోనా నుంచి కోలుకున్నవారికి రెండోసారి ఇన్ఫెక్షన్‌ సోకినా.. వారి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమించే అవకాశాలు ఉండవని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అంటున్నారు. రెండోసారి కొవిడ్‌-19 బారినపడిన 285 మంది రోగుల నుంచి సేకరించిన వైరస్‌ శాంపిళ్లను ప్రయోగశాలలో పరీక్షించగా.. వాటిలో ఎలాంటి పెరుగుదల నమోదుకాలేదని కొరియన్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (కేసీడీసీపీ) వెల్లడించింది. రెండోసారి కరోనా పాజిటివ్‌ తేలినవారిలో వైరస్‌ పూర్తిస్థాయిలో నిర్వీర్యమై ఉంటుందనేందుకు ఇదొక నిదర్శనమని పేర్కొంది. అయితే ఈవిధమైన రోగ నిరోధకత వారిలో ఎంతకాలం కొనసాగుతుంది? అనే దానిపై శాస్త్రవేత్తలు స్పష్టతకు రాలేకపోయారు.   

Advertisement
Advertisement
Advertisement