Abn logo
May 21 2020 @ 03:38AM

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాపాడుకుంటది

లబ్ధి కోసమే కాంగ్రె్‌స-బీజేపీలు ముస్లింలను బదనాం చేస్తున్నాయి

పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


దేవరుప్పుల/ కొడకండ్ల మే 20 :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లింలను కాపాడుకుంటదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ముస్లింలకు ‘ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో రంజాన్‌ కానుకలను, నిత్యావసర సరుకులను, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలోని 3 వేలమంది కుటుంబాలకు చిరుకానుకలను అందజేస్తున్నామన్నారు.


ఢిల్లీలో జరిగిన ముస్లిం సభతోనే తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాపించిందని కాంగ్రె్‌స-బీజేపీ పార్టీలు రాజకీయ లబ్ధికోసం బదనాం చేస్తున్నాయన్నారు. రైతుల కోసం ముఖ్య మంత్రి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని, రైతుబంధుకు రూ. 7వేల కోట్లు, రుణమాఫీకి రూ.1200 కోట్లు కేటాయించారన్నారు. ఎంపీపీ బస్వ సావిత్రి, జిల్లా సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమే్‌షరెడ్డి, ఎంపీడీవో అనిత, తహసీల్ధార్‌ ఫరీదొద్దీన్‌. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌ పాల్గొన్నారు. అలాగే కొడకండ్ల జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ సత్తెమ్మ, ఎంపీపీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement