Abn logo
Oct 10 2020 @ 02:59AM

తప్పులు దొర్లకుండా సర్వే నిర్వహించాలి

Kaakateeya

డీఎల్‌పీవో స్మిత


ఘట్‌కేసర్‌ రూరల్‌/మేడ్చల్‌ రూరల్‌: ఇంటింటి సర్వేలో తప్పులు దొర్లకుండా చూడాలని పంచాయతీ అధికారులకు, సిబ్బందికి డీఎల్‌పీవో స్మిత సూచించారు. మండలంలోని ఘణపురంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటిసర్వే కార్యక్రమంలో ఆమె పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటికి సర్వే కోసం వస్తున్న పంచాయతీ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు మండలంలో 4315 ఇంటి వివరాలను ధరణీ ఫోర్టల్‌లో పొందిపరిచినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సర్పంచ్‌ బద్దం గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యుడు పరమే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.


వెంకటాపూర్‌లో ఇన్‌చార్జి ఎంపీడీవో పద్మలత ఇంటింటి సర్వేలో పాల్గొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నీరుడి గీతాశ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ కట్ట సత్యనారాయణగౌడ్‌, సిబ్బంది మాధవి, శరణ్య పాల్గొన్నారు. మేడ్చల్‌ మండలంలోని డబిల్‌పూర్‌ గ్రామంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి ఇంటింటి సర్వేను వైస్‌ ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, సర్పంచ్‌ వీర్లపల్లి గీతాభాగ్యారెడి ్డలతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎండీఓ శశిరేఖ, వి, వి.భాగ్యారెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement