Abn logo
Oct 20 2021 @ 23:13PM

ఉక్కుపై ప్రజా సంఘాల పోరుబాట

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు

ఈనెల 30న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రదర్శన, బహిరంగ సభ

హాజరు కానున్న ఉద్యమాల వేదిక జాతీయ సమన్వయకర్త మేధాపాట్కర్‌

విశాఖపట్నం, అక్టోబరు 20: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్‌టీయూ, పీఓడబ్ల్యూ, అరుణోదయ, ఎంఎన్‌ఎస్‌ఎస్‌, ఎఐకెంఎస్‌, పీడీఎస్‌యు సంఘాల ఆధ్వర్యంలో  ఈనెల 30న గాజువాకలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు.


అనంతరం మాట్లాడుతూ గాజువాకలో జరిగే ర్యాలీ, సభలో జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక జాతీయ సమన్వయకర్త మేధాపాట్కర్‌, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ అపర్ణ పాల్గొంటారని తెలిపారు. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్‌ అధ్యక్షోపన్యాసం చేయనున్నారని తెలిపారు. పాత గాజువాక జంక్షన్‌ నుంచి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ర్యాలీగా పెదగంట్యాడ వినాయకనగర్‌ ఓపెన్‌ ఆడిటోరియం వద్దకు చేరుకుంటామని, అక్కడ సభ జరగనుందన్నారు.


ఈ సమావేశంలో ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ ప్రకాష్‌, ఐఎఫ్‌టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, ఎంఎన్‌ఎస్‌ఎస్‌ నగర అధ్యక్షులు కె.రవి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నిర్మల తదితరులు పాల్గొన్నారు.