Abn logo
Sep 30 2020 @ 05:31AM

ధాన్యం... దైన్యం

Kaakateeya

 కొనేవారి కోసం అన్నదాతల నిరీక్షణ


శ్రీకాళహస్తి, సెప్టెంబరు 29 : తూర్పు మండలాల్లో వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి వారు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి ధాన్యం ధర తగ్గించేశారు.కోతలు చాలా వరకు పూర్తి కావడం... ధాన్యం నిల్వ చేసుకోవడానికి తగిన సదుపాయాలు లేకపోవడం... దీనికి తోడు వర్షం కారణంగా ధాన్యం తడిసి పోతుండటంతో దళారులు, మిల్లర్లు అడిగిన ధరకే రైతులు ధాన్యాన్ని ఇవ్వాల్సి వస్తోంది. నెల్లూరు మసూరా రకం గత ఏడాది బస్తా(75కిలోలు) రూ.1,400 పలకగా... ప్రస్తుతం రు.650 మాత్రమే పలుకుతోంది. మార్కెట్‌లో బాగా డిమాండున్న నెల్లూరు మసూరా స్థితే ఇలా ఉంటే... మిగిలిన రకాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.శ్రీకాళహస్తి వ్యవసాయశాఖ డివిజన్‌లో ఖరీఫ్‌ సీజనులో సుమారు 15వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.  వీరందరి పరిస్థితి ఇలాగే ఉంది.  

Advertisement
Advertisement
Advertisement