Aryan Khan ను అరెస్ట్ చేసిన NCB Director భార్య గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!

బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాలను వాడటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో రియా చక్రర్తి, ప్రీతికా చౌహాన్, రకుల్ ప్రీత్ సింగ్, పర్దీన్ ఖాన్, దీపికా పదుకొనే తదితరులను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఫలితంగా డ్రగ్స్‌పై ఇంటర్నెట్‌లో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్‌సీబీ) అధికారి అయిన సమీర్ వాంఖేడే ఆర్యన్ సహా 8మందిని అరెస్టు చేశారు. గతంలో అనేక మంది సెలబ్రిటీలను కూడా అరెస్టు చేశారు. అందువల్ల ఆయన గురించి ఇంటర్నెట్‌లో వెతుకున్నారు. ఆయన భార్య అనేక సార్లు వెండితెరపై కనిపించారు. ఇంతకీ ఆమె ఎవరంటే..


ఆమె పేరు క్రాంతి రెడ్కర్. సమీర్ వాంఖేడేతో 2017లో వివాహం అయింది. మరాఠీ, హిందీ  చిత్రాల్లో నటించారు. ప్రకాశ్ ఝూ దర్శకత్వం వహించిన ‘‘ గంగాజల్ ’’ చిత్రంతో బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించారు. ‘‘ సున్ అసవి అశి’’ అనే మరాఠీ చిత్రంలో నటించారు. ఆ చిత్రం 2000లో విడుదలైంది. మరాఠీ చిత్రాల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. అనంతరం 15 ఏళ్ల తర్వాత  ‘‘కాకన్’’ సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త ఎవరితోను ఎక్కువగా మాట్లాడారని, ఎప్పుడు రిజర్వ్‌గా ఉంటారని ఆమె చెప్పారు. 


క్రాంతి రెడ్కర్ తన భర్త గురించి ఒక ఇంటార్వ్యూలో మాట్లాడుతూ..‘‘ మా వారు పని దృష్ట్యా చాలా బిజీగా ఉంటారు. అందువల్ల మా పిల్లలు ఎప్పుడు ఆయనను మిస్ అవుతూ ఉంటారు.  కుటుంబం, పిల్లలను నేను చూసుకుంటానని మా వారికి తెలుసు. అందువల్ల ఎప్పుడు ఆందోళనకు గురవరు. దేశం కోసం ఆయన పిల్లలు, కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. అందుకే ఆయనను చూసి నేను గర్విస్తున్నాను ’’ అని వివరించారు.

Advertisement

Bollywoodమరిన్ని...