Abn logo
Oct 15 2021 @ 01:11AM

అమరవీరుల సేవలు మరువలేనివి

కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ సైనికులు


రాప్తాడు, అక్టోబరు 14: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు మరువలేనివని రాప్తాడు నియోజకవర్గ మాజీ సైనికుల సంఘం అధ్య క్షుడు మారుతీప్రసాద్‌ అన్నారు.  ఈనెల 11న అమరులైన భారతీయ సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని నియోజకవర్గ మాజీ సైనికులు గురువారం రాప్తాడులో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు నారాయణస్వామి, భాస్కర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.