Abn logo
Oct 15 2021 @ 00:04AM

అమరవీరుల త్యాగాలు మరువలేనివి : సీపీ


ఖిల్లా, అక్టోబరు 14: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూ తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని సీపీ కార్తికేయ అన్నారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది చేసిన త్యాగల వల్ల ప్రస్తుత శాంతియుత వాతావరణం నెలకొందని, ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగానే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21 నుంచి 31 అక్టోబరు వరకు పోలీసు కుటుంబాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, రంగుల పోటీలు, పేయింటింగ్‌ కార్యక్రమాలు, మరణించిన సిబ్బంది కుటుంబాల కష్టసుఖాలను తెలుసుకోవడంకోసం కౌన్సెలింగ్‌ వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు.